అభయారణ్యంలో శిక్షణ అధికారుల ట్రెక్కింగ్‌ | - | Sakshi
Sakshi News home page

అభయారణ్యంలో శిక్షణ అధికారుల ట్రెక్కింగ్‌

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

అభయారణ్యంలో శిక్షణ అధికారుల ట్రెక్కింగ్‌

అభయారణ్యంలో శిక్షణ అధికారుల ట్రెక్కింగ్‌

మన్ననూర్‌: అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యం, అటవీ లోతట్టు ప్రాంతంలోని సలేశ్వరం, అక్కమదేవి గృహలు ప్రదేశాల్లో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు స్టడీ టూర్‌లో భాగంగా సోమవారం ట్రెక్కింగ్‌ చేశారు. ఈ ప్రాంతానికి శిక్షణ కోసం వచ్చిన 280 మంది శిక్షణ అధికారులు రెండు గ్రూప్‌లుగా విడిపోయారు. ఈ క్రమంలో సుమారు 140 మంది అధికారులు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో అభయారణ్యంలోని సలేశ్వరం, అక్కమ్మదేవి గుహలకు ట్రెక్కింగ్‌ చేశారు. అక్క డి ప్రదేశాల ప్రాధాన్యత, విశిష్టత తదితర వివరాలను అధికారులకు వివరించారు. సోమవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు జరిగే స్టడీ టూర్‌లో ప్రతినిత్యం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని అటవీశాఖ రేంజ్‌ అధికారి వీరేష్‌ తెలిపారు. మార్గమధ్యలో రాంపూర్‌ చెంచు పెంటలోని చెంచుల నివాసాలను అధికారులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement