నాగర్‌కర్నూల్‌ | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌

Feb 10 2026 8:03 AM | Updated on Feb 10 2026 8:03 AM

నాగర్

నాగర్‌కర్నూల్‌

న్యూస్‌రీల్‌

ఒక్కోచోట.. ఒక్కో తీరు

ఆంక్షలు అమలు

మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

ప్రచారం ముగిసె..

రేపు ప్రత్యేక సెలవు

కందనూలు: మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం పబ్లిక్‌ హాలిడే ప్రకటించినట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందన్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలకు ఆదేశించారు. పోలింగ్‌ నిర్వహణకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించగా ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే విద్యా సంస్థలకు గురు, శుక్రవారాలు లోకల్‌ హాలిడే వర్తిస్తుందని చెప్పారు.

కొనసాగుతున్న

నిరసన దీక్షలు

చారకొండ: మండలంలోని గోకారం జలాశయంలో ముంపు గ్రామాలను మినహాయించాలని కోరుతూ చేపడుతున్న దీక్షలు 70 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం దీక్షలో కూర్చున్న నిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వంగా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిండి– నార్లాపూర్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న గోకారం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలకు మెరుగైన

వైద్యం అందించాలి

లింగాల: జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ రవికుమార్‌ అన్నారు. సోమవారం మండలంలోని అంబట్‌పల్లి చెంచు కాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలను మెరుగుపరచడమే కాకుండా.. తరుచుగా చెంచు పెంటలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అంబట్‌పల్లిలో ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యులు 150 మందిని పరీక్షించి.. 70 మందికి షుగర్‌, బీపీ తదితర పరీక్షలు జరపగా.. 12 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించారు. వైద్య శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జిల్లా అదనపు వైద్యా ధికారి సురేష్‌బాబు, వైద్యులు శరత్‌, జయచంద్రప్రసాద్‌, గైనకాలజిస్టు శిరీష, సబ్‌ యూనిట్‌ అధికారి బిక్‌లాల్‌, సూపర్‌వైజర్‌ లక్ష్మమ్మ, హెచ్‌ఏ రామచందర్‌, మల్లేష్‌, ఏఎన్‌ఎంలు, ఆశాలు, ఐటీడీఏ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రలోభాలు ఎగసె

మున్సిపల్‌ ఎన్నికల్లో ముగిసిన ప్రచార పర్వం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. గత పదిరోజులుగా పాటలు, ప్రసంగాలతో ప్రచారాన్ని హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. పెద్దసంఖ్యలో జనం, డీజే చప్పుళ్లు, మంది మార్బలంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా.. సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా పట్టణాల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. బుధవారమే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. సోమవారం సాయంత్రానికి ప్రచారం పర్వం ముగియగా.. అభ్యర్థులు పెద్దఎత్తున ప్రలోభాలకు తెరలేపారు.

ప్రచారంలో పై‘చేయి’..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అధికార కాంగ్రెస్‌ ప్రచార పర్వంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ర్యాలీలతోపాటు ప్రచారంలో పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరిస్తూ బలప్రదర్శన నిర్వహించింది. మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఆయన తనయుడు అరుణ్‌ కొల్లాపూర్‌ మున్సిపాలిటీకే పరిమితమై పూర్తిస్థాయిలో సమయం కేటాయించారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి ఇద్దరూ అన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితోపాటు పీసీబీ మెంబర్‌ బాలాజీసింగ్‌ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేశారు.

ఖర్చులో ఎక్కడా తగ్గట్లే..

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు పలువురు స్వతంత్రులు ఖర్చులో ఏమాత్రం వెనకాడటం లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు మద్యం, డబ్బుతో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో నివసించే వలస ఓటర్లను ఓటింగ్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున చెల్లించడంతోపాటు ప్రయాణ ఖర్చులను ముందుగానే ముట్టజెప్పుతున్నారు. పలువురు అభ్యర్థులు తమ అనుచరుల ద్వారా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నేరుగా ఓటర్ల ఖాతాలకు వేయిస్తున్నారు.

కందనూలు: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేందుకు గాను ర్యాండమైజేషన్‌ పూర్తిచేసినట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్‌ దేవసహాయంతో కలిసి కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు గాను అవసరమైన సిబ్బందితోపాటు అదనంగా 20 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచామన్నారు. అలాగే బుధవారం పోలింగ్‌ ప్రక్రియకు అవసరమైన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలను మూడో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా నేరుగా ఆయా పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించేలా శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి రమేష్‌కుమార్‌, ఈడీఎం నరేష్‌ పాల్గొన్నారు.

ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌,

ఎన్నికల పరిశీలకురాలు రాజ్యలక్ష్మి, అదనపు కలెక్టర్‌ దేవసహాయం తదితరులు

ఈసారి మున్సిపల్‌ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అభ్యర్థులు ఒకరికి మించి మరొకరు అన్నట్టుగా పోటీపడుతున్నారు. ఇప్పటికే మద్యం, నోటు, మాంసం రూపంలో పెద్దఎత్తున ప్రలోభాలు కొనసాగుతుండగా ఎన్నికలకు ముందు రోజు భారీస్థాయిలో డబ్బు పంపిణీకి సన్నాహాలు పూర్తయ్యాయి. రిజర్వ్‌డ్‌, జనరల్‌ వార్డు తేడా లేకుండా ఎక్కడ చూసినా ఒక్కో అభ్యర్థి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వెచ్చించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పలుచోట్ల ఒక్కో ఓటుకు కనీసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట, చైర్మన్‌ ఆశావహులుగా ఉన్న వార్డుల్లో ఖర్చు మరింత పెరుగనుంది.

పెద్దఎత్తున మద్యం, డబ్బుల

పంపిణీకి ప్రయత్నాలు

ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్న

అభ్యర్థులు, నాయకులు

గంపగుత్తగా ఓట్లు పొందేందుకు

సర్వశక్తులు ఒడ్డుతున్న వైనం

రేపే పుర సమరం

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ పట్టణాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు జరిగే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. కాబట్టి పట్టణాల్లో ఎవరూ కూడా బహిరంగంగా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం పోలింగ్‌ ముగిసే వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని శుక్రవారం సైతం మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్‌ ముగిసే వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

నాగర్‌కర్నూల్‌1
1/5

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌2
2/5

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌3
3/5

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌4
4/5

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌5
5/5

నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement