న్యూస్‌రీల్
● ఎట్టకేలకు ఫైనల్‌లొకేషన్ సర్వే పూర్తి
● వనపర్తి, నాగర్‌కర్నూల్,కల్వకుర్తి, దేవరకొండ మీదుగా మార్గం
● ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,330 కోట్లు
● రైలు మార్గం పొడవు 296 కిలోమీటర్లు
● కీలక అభివృద్ధికి మరో ముందడుగు
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలి
తెలకపల్లి: చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని చిన్నముద్దనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆయన పరిశీలించి.. లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకొని గృహప్రవేశాలు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయన వెంట హౌసింగ్ పీడీ సంగప్ప, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏఈ హుస్సేన్, సర్పంచ్ రుక్సానాబేగం, పంచాయతీ కార్యదర్శి శిరీష ఉన్నారు.
ప్రజా సమస్యలపై
నిరంతర పోరాటం
తెలకపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. బుధవారం తెలకపల్లిలో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా నేటికీ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. అంటరానితనం, అవమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఖనిజ సంపదను కొల్లగొట్టి బడా వ్యాపారులకు కట్టబెట్టిందని ఆరోపించారు. మరోవైపు విచ్చలవిడిగా నిత్యావసరాల ధరలు పెంచుతూ.. పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిని సీపీఐ సందర్శించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రజా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవులుగౌడ్, మండల కార్యదర్శి రవీందర్, శంకర్‌గౌడ్, బుగ్గస్వామి, ఆంజనేయులు, శివకృష్ణ, నరేందర్‌రెడ్డి, బాలపీరు, బాలస్వామి పాల్గొన్నారు.
ఓట్ల తొలగింపు సరికాదు
కందనూలు: కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో ఓట్లను తొలగించడం సరైంది కాదని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఓట్లు తొలగించి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అదే విధంగా దేశ ప్రజలను కులం, మతం పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఓటరు జాబితా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహుజనుల రాజ్యాధికార ఆత్మగౌరవ సభకు జిల్లా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇన్‌చార్జి అంతటి నాగన్న, పృథ్వీరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న, సాయిబాబా, రామకృష్ణ పాల్గొన్నారు.
నేడు విద్యుత్ ఆర్టిజన్లవంటావార్పు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్‌శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్ల తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం విద్యుత్ భవన్ ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, జడ్చర్ల డివిజన్ చైర్మన్ జహంగీర్, మహబూబ్‌నగర్ డివిజన్ చైర్మన్ పెంటయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న ప్రతి విద్యుత్ కార్మికుడు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రైలు కనెక్టివిటీబలోపేతం
కనెక్టివిటీల ప్రకారం అలైన్‌మెంట్ మార్చి కొత్త రైలు మార్గం రూపొందించారు. ఈ రైలు మార్గంలో తెలంగాణలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ కొత్త రైల్వేలైన్ కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, భీమవరం, నల్లగొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి వంటి ముఖ్యమైన పట్టణాలను అనుసంధానించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ఈ ముఖ్యమైన ప్రాజెక్టులలో డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ ఒకటి. ఎట్టకేలకు ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశం లభించింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. నాలుగు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది.
200 కిలోమీటర్ల దూరం
ఇప్పటి వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేని వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట జిల్లాలకు రైల్వే సౌకర్యం కలిగి.. వెనకబడిన ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఈ రైల్వేలైన్ ఏర్పాటుతో కాజీపేట– విజయవాడ, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– కర్నూలు వంటి మూడు ప్రధాన రైల్వేలైన్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇప్పటికే గద్వాల– రాయచూర్, డోర్నకల్– మణుగూరు (మహబూబాబాద్) మధ్య రైల్వే లైన్స్ ఉన్నాయి. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణలోని తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా రైలు మార్గంలో సుమారు 200 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల, డోర్నకల్ రైల్వేస్టేషన్లు జంక్షన్లు కాగా కొత్తగా నల్లగొండ రైల్వేస్టేషన్ జంక్షన్ ఏర్పడుతుంది. రైల్వేలైన్, మామిడి క్లస్టర్, జాతీయ రహదారులతో నాగర్‌కర్నూల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందనుంది.
జడ్చర్ల– నంద్యాల సర్వే పూర్తి
జడ్చర్ల– నంద్యాల కొత్త రైల్వేలైన్ మార్గం సర్వే కూడా పూర్తయింది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా నంద్యాల వరకు 182 కి.మీ., మార్గం అత్యంత కీలకమైంది. అప్పటి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు అనంతరాములు దీని కోసం పట్టుబట్టి సర్వేల వరకు తీసుకొచ్చారు. రూ.340 కోట్ల అంచనాతో 2007లో ప్రతిపాదనలు తయారు చేశారు. డోర్నకల్– గద్వాల రైల్వే మార్గంతో పాటు దీని సర్వే చేసినా.. ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే శాఖ భావిస్తోంది.
దీంతో ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు రాకపోకలకు దగ్గర అవుతుంది.
1981లో బీజం.. మార్పులతో ఆమోదం
గతంలో ప్రతిపాదించిన మాచర్ల– గద్వాల రైల్వేలైన్ రూట్ మ్యాప్‌ను మార్చారు. తాజాగా గద్వాల– డోర్నకల్ రైల్ మార్గం సర్వే పూర్తి చేసింది. ఈ రైల్వేలైన్‌లో 296 కిలోమీటర్లు తెలంగాణ జిల్లాలోనే ఉంది. రాయచూర్, గద్వాల– మాచర్ల (గుంటూరు జిల్లా) రైల్వే లైన్ ప్రతిపాదన నిజాం కాలం నుంచి కొనసాగుతుంది. ఇందుకోసం మూడు సార్లు సర్వే సైతం చేశారు. రాయచూరు– మాచర్ల రైలు మార్గం ఆవశ్యకతను వివరిస్తూ.. 1981లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదించారు. అప్పట్లో 184.2 కి.మీ., రైల్వేలైన్ కోసం రూ.919 కోట్ల నిధులు కేటాయించారు. 2002లో రాయచూర్– గద్వాల రైలు మార్గానికి శంకుస్థాపన చేయగా చివరికి గద్వాలకే పరిమితమైంది. మరుగున పడిపోయిన రైల్వే అంశం 2007లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్‌ను మరోసారి కేంద్రానికి పంపించారు. 2015లో కేంద్రం సర్వేకు రూ.20 కోట్లు కేటాయించింది. పీపీసీ మోడ్‌లో (పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కొత్త లైన్‌ను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా.. సగం, సగం నిధులు ఖర్చు చేసే విషయం తేలకపోవడంతో రైల్వేలైన్‌కు అడుగులు పడలేదు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చి సర్వే పూర్తికావడంతో కొత్తలైన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.
పరిశ్రమలు, ఉపాధి మెరుగు..
దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు రైలు సౌకర్యం లేని ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ అనుసంధానం కానుంది. ఈ కొత్త లైన్ ద్వారా రాష్ట్రంలోని ఆయా జిల్లాకేంద్రాలతోపాటు హైదరాబాద్, దేశ రాజధానికి అనుసంధానించబడుతుంది. అలాగే మొదటిసారి రైలు సౌకర్యం పొందడం వల్ల ఈ ప్రాంత సామాజిక– ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, వైద్యం వంటి వివిధ రంగాల కోసం రాష్ట్ర రాజధానికి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ లైన్ సిమెంట్, గ్రానైట్ పారిశ్రామిక జోన్ల గుండా వెళ్తుండటం వల్ల ఆ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఊతం లభిస్తుంది. అలాగే సింగరేణి కాలరీస్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేయడానికి ఇది తక్కువ దూరపు మార్గంగా ఉపయోగపడుతుంది.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తా..
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త రైల్వే లైన్ల ఆవశ్యకత ఎంతో ఉంది. పార్లమెంట్ సమావేశాల్లో రైల్వేలైన్ల గురించి అడగగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డోర్నకల్– గద్వాల కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల– నంద్యాల మార్గం సర్వే కూడా పూర్తయిందని, కానీ ఈ మార్గంలో ట్రాఫిక్ అంచనాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వెల్లడించారు. ఈ రెండు లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తా. అలాగే హైదరాబాద్– శ్రీశైలం రైలు మార్గం ఏర్పాటు గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
●
పీయూ ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి మొదటి సెమిస్టర్ ఫలితాలను వీసీ శ్రీనివాస్ పీయూలో బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్, మిషన్ లర్నింగ్‌లో మొత్తం 62మంది ఉండగా ఇందులో 34 మంది ఉత్తీర్ణులై, 28మంది ప్రమోట్ అయ్యారు. డేటాసైన్స్‌లో 32 మంది ఉత్తీర్ణులై, 29 మంది ప్రమోట్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్‌లో 24 మంది ఉత్తీర్ణులై, 40 మంది ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడీషనల్ కంట్రోలర్ అనురాధారెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బావాజీ ఉత్సవాలు ప్రారంభం
తిమ్మారెడ్డిపల్లిలో గిరిజనుల ఆరాధ్య దైవం గురు లోకమాసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
–8లో u


