సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ ఫలాలు అర్హులకు అందాలి

Apr 2 2026 9:10 AM | Updated on Apr 2 2026 9:10 AM

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

చిన్నంబావి: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మండలంలోని దగడపల్లి, అమ్మాయిపల్లిలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. దగడపల్లి – తూంకుంట, దగడపల్లి – పెద్దదగడ మధ్య బీటీ రహదారి, దగడపల్లి – వీపనగండ్ల మధ్య ఉన్న బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.కోటి మంజూరు, ఆయా గ్రామాల్లో అంతర్గత సీసీ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని సర్పంచ్‌ గంగాధర్‌ మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అత్యధికంగా సీసీ రహదారులకు నిధులు మంజూరు చేశామని, గ్రామస్థాయిలో రాజకీయాలకు తావులేకుండా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కార్యకర్తలపై ఆగ్రహం..

మండలంలోని దగడపల్లిలో జరిగిన ముఖాముఖి లో సర్పంచ్‌ గంగధార్‌ పాల్గొన్నారు. పార్టీకి మద్దతు ఇవ్వని వ్యక్తికి ఎలా మాట్లాడే అవకాశం ఇస్తారని కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రిని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అంతిమ లక్ష్యం గ్రామాభివృద్ధి అని మంత్రి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిన చింతల వెంకటేష్‌ను హెచ్చ రిస్తూ ఇది మంచి పద్ధతి కాదని.. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు.

మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు..

మహిళలమని చూడకుండా వార్డుసభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అమ్మాయిపల్లి సర్పంచ్‌ కవిత, ఉపసర్పంచ్‌ మాధవి మంత్రికి వివరించారు. మహిళలను గౌరవించాలని, మహిళా ప్రజాప్రతినిధులను అగౌరవపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయాలు మానుకోవాలని.. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్‌ యాదవ్‌, బీచుపల్లి యాదవ్‌, సర్పంచ్‌లు కవిత ప్రభంజన్‌గౌడ్‌, గంగాధర్‌, ఉపసర్పంచ్‌ మాధవి మాధవరెడ్డి, కిరణ్‌కుమార్‌గౌడ్‌, చింతల శ్రీనివాసులు, శంకర్‌, బాలకృష్ణ, రాజకుమార్‌, ఉమేష్‌ నాయుడు, సుధాకర్‌ నాయు డు, జ్యోతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement