ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 53 మంది గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 53 మంది గైర్హాజరు

Feb 6 2026 8:57 AM | Updated on Feb 6 2026 8:57 AM

ఇంటర్

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 53 మంది గైర్హాజరు

కందనూలు: జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌కు 53 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లావ్యాప్తంగా మొత్తం 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 1,833 మంది విద్యార్థులకు గాను 1,783 మంది హాజరయ్యారు. ప్రాక్టికల్స్‌ సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డీఐఈఓ పేర్కొన్నారు.

నవోదయ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు

బిజినేపల్లి: వట్టెం జవహార్‌ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశాల కోసం శనివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రావు అన్నారు. గురువారం నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల సూపరింటెండెంట్లు, కేంద్రస్థాయి పరిశీలకులకు నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్‌ పి.భాస్కర్‌కుమార్‌ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రావు మాట్లాడుతూ 9వ తరగతిలో 6, 11వ తరగతిలో 13 ఖాళీలకు గాను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని, ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నిర్వహించే పరీక్షకు మొత్తం 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.

విద్యుత్‌ సమస్యల గుర్తింపునకే పల్లెబాట

పాన్‌గల్‌: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్‌ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని అన్నారం గ్రామంలో ట్రాన్స్‌కో ఏఈ చందన్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. బీసీకాలనీలో మూడో విద్యుత్‌ తీగ ఏర్పాటు, ఎస్సీకాలనీలో రేషన్‌ దుకాణం వెనుక ఉన్న విద్యుత్‌ స్తంభాలకు తీగల బిగింపు, ధర్మరాజుగడ్డలో ఇళ్ల నడుమ ఉన్న విద్యుత్‌ తీగల తొలగింపు, బస్టాండ్‌ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో విద్యుత్‌ లైన్లు, పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ బోరుబావులకు డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలనే సమస్యలను సర్పంచ్‌ వహీద్‌ విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 53 మంది గైర్హాజరు 
1
1/1

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు 53 మంది గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement