డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు
కందనూలు: డిజిటల్ బోధనతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీపై పీఎంశ్రీ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ టూల్స్ గూగుల్ షీట్స్, వలూమి సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 27 పీఎంశ్రీ పాఠశాలల్లో ఐసీటీ, ఏఐ ద్వారా విద్యాబోధన చేయాలన్నారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే డీఈఓ కార్యాలయంలో సమాచార హక్కుచట్టంపై ఎంఈఓలు, కార్యాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి ఎండీ షర్ఫుద్దీన్, రీసోర్స్ క్లస్టర్లు కృష్ణమోహన్, జహీర్, జంగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


