వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించిన కలెక్టర్
కందనూలు: జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుంచి జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లోని 131 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. అనంతరం జిల్లాకేంద్రం మున్సిపాలిటీలోని 15వ వార్డు క్రిస్టియన్‌కాలనీ, 14వ వార్డు సంత బజార్‌లో పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లతో మాట్లాడి.. వారికి అందుతున్న సౌకర్యాలు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలని ఏజెంట్లకు సూచించారు.
జిల్లాకేంద్రంలోని 14వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన
కలెక్టర్ బదావత్ సంతోష్


