కాంగ్రెస్‌లో జోష్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో జోష్‌

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

కాంగ్

కాంగ్రెస్‌లో జోష్‌

అన్నిచోట్ల ఢీలా పడిన బీజేపీ..

మున్సిపల్‌ ఎన్నికల సమరాన్ని మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడు తూ, ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే ము న్సిపల్‌ ఎన్నికల ఫలితాలు బీజే పీ శ్రేణులను నైరాశ్యానికి గురిచేశాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాషాయ పార్టీ ఢీలా పడింది. కల్వకుర్తిలోనే బీజేపీకి అత్యధికంగా 5 వార్డు స్థానాలు దక్కాయి. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీతో పాటు కొల్లాపూర్‌లో బీజేపీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఇప్పటివరకు బోణి కొట్టలేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపుతామని పార్టీ శ్రేణులు భావించగా.. ఫలితాల్లో మాత్రం నిరాశే మిగిలింది.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల చైర్మన్‌ పీఠాలను కై వసం చేసుకోవడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీలో జోష్‌ నింపగా.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో నైరాశ్యాన్ని నింపింది. మూడు ప్రధాన పార్టీలు రాజకీయ గుర్తులతో క్షేత్రస్థాయిలో తలపడిన పురపోరులో ఫలితాలపై ఎవరికి వారు విశ్లేషణల్లో మునిగిపోయారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వీటి ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

తగ్గిన కారు జోరు..

మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జోరు తగ్గింది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. గత పంచాయతీ ఎన్నికల్లో మోస్తరుగా సర్పంచ్‌ స్థానాలను గెలుచుకోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ అంచనాలు పెరిగాయి. అయితే అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలోనే బీఆర్‌ఎస్‌కు 6 వార్డు స్థానాలు దక్కాయి. కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో మూడేసి చొప్పున స్థానాలకే పరిమితమైంది. కల్వకుర్తిలో బీజేపీకి 5 స్థానాలు వస్తే.. బీఆర్‌ఎస్‌ 3 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ ఉండగా.. బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పరిమితమైంది.

ప్రాదేశిక ఎన్నికలకు సన్నద్ధం..

మున్సిపల్‌ ఎన్నికల పర్వం ముగియడంతో రాజకీయ పార్టీల దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రభావం రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చూపిస్తుందన్న విషయంలో అంచనాలు మొదలయ్యాయి. పట్టణ ఓటర్లు, పల్లె ఓటర్లకు తారతమ్యం ఉండొచ్చన్న భావనతో పార్టీలు వ్యూహరచనకు సిద్ధమవుతున్నాయి. రాజకీయ గుర్తులతో తమ అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రాదేశిక ఎన్నికల్లో ఆధిపత్యం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటి పై‘చేయి’..

రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకా కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులకు గాను కాంగ్రెస్‌ ఏకంగా 16 స్థానాలను గెలుచుకుంది. సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన రెడ్డి జ్యోతికి ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. కల్వకుర్తి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డు స్థానాలకు గాను కాంగ్రెస్‌ 13 స్థానాల్లో గెలిచింది. ఇక్కడ చైర్మన్‌ పీఠం జనరల్‌కు రిజర్వు కాగా.. బీసీ వర్గానికి చెందిన రత్నమాల చైర్‌పర్సన్‌ అయ్యారు. నాగర్‌కర్నూల్‌ పురపాలికలో 24 వార్డులు ఉండగా, అత్యధికంగా 18 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. 23 వార్డు నుంచి గెలుపొందిన యువ కౌన్సిలర్‌ తీగల సునేంద్రకు చైర్మన్‌గా అవకాశం దక్కింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు మించి కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలతో పై‘చెయ్యి’గా నిలిచింది.

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో హస్తం హవా

కొల్లాపూర్‌, కల్వకుర్తిలో మూడు స్థానాలకే పరిమితమైన బీఆర్‌ఎస్‌

నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌లో బోణీ కొట్టని కాషాయ పార్టీ

కాంగ్రెస్‌లో జోష్‌1
1/2

కాంగ్రెస్‌లో జోష్‌

కాంగ్రెస్‌లో జోష్‌2
2/2

కాంగ్రెస్‌లో జోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement