కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
కొల్లాపూర్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్‌లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టి.. వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇంకా రెండున్నరేళ్లకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి పనులు నిరాటంకంగా చేసుకోవచ్చన్నారు. ప్రజలు వృథా ఖర్చులు తగ్గించుకోవాలని, ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావొద్దని హితవు పలికారు. పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు విద్యాలయాల్లో చేర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లోనే పిల్లలను చదివించాలని సూచించారు. వైద్యసేవలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పొందాలని చెప్పారు. మోటార్ సైకిళ్లను విరివిగా వినియోగించడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని, ప్రతిఒక్కరూ సైకిల్ వాడకాన్ని పెంచి.. కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆయన సైకిల్ తొక్కుతూ ఎన్నికల ప్రచారం చేశారు.


