ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల, పేట, అమరచింత, పెబ్బేరు, అలంపూర్‌లో కీలకం
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి.
సంపూర్ణ మెజారీటి లేకపోతే..
మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్‌పర్సన్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్‌అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
తెలంగాణ మున్సిపల్ యాక్ట్–19 ఆర్టికల్ 243–ఆర్ రిట్ పిటిషన్ నంబర్ 20262/2021 ప్రకారం రాష్ట్ర హైకోర్టు ఎక్స్ అఫీషియో ఓట్లపై కీలక తీర్పునిచ్చింది.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో లోక్‌సభ ఎంపీ, రాష్ట్ర శాసన సభ్యులు వారి నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా మున్సిపాలిటీ ఏరియాలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర ఎమ్మెల్సీలు ఆయా మున్సిపాలిటీల్లో అప్పటికే ఓటరుగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. అలా ఉన్న మున్సిపాలిటీలో మాత్రమే ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
రాజ్యాంగబద్ధ కమిటీలో చైర్మన్లుగా ఉన్నవారు అంతకు పూర్వమే వారి మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. అలా ఉన్న మున్సిపాలిటీ ఏరియాలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోచ్చు.
ఎన్నికల సంఘం నూతన
నిబంధనలతో తప్పని ఇబ్బందులు
దీని ఆధారంగానే సుప్రీంను
ఆశ్రయించనున్న బీఆర్‌ఎస్?


