ప్రతి చిన్నారికి వ్యాక్సిన్
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని ప్రతి చిన్నారికి తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సురేష్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని మల్కాపూర్‌లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు యూవిన్ పోర్టల్ నందు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి అన్ని టీకాలు వేయించడం అత్యంత అవసరమన్నారు. జిల్లాలో ప్రతి అర్హులైన చిన్నారికి డ్యూ లిస్ట్ ప్రకారం టీకాలు అందేలా చూడాలని, ఒక్కరిని కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రికార్డు నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, ఆన్‌లైన్ నమోదులోనూ కచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్, ఏపీఓ చారి, వీసీసీఎం దివ్య తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ విధానాన్ని
రద్దు చేయాలి
కందనూలు: ఏజెన్సీ విధానాన్ని రద్దుచేసి నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ రాష్ట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం అమలుపరుస్తున్న ఏజెన్సీ విధానాన్ని రద్దుపరిచి.. నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు. పీఆర్‌సీలోని స్లాబ్ విధానాన్ని రద్దుపరిచి, క్యాడర్ బేసిక్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుభాష్, జిల్లా అధ్యక్షుడు రామచందర్‌జీ, కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
పల్లీ @ రూ.9,700
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.9,700, కనిష్టంగా రూ. 6,512, సరాసరిగా రూ.9,467 ధర లభించింది. కాగా.. మార్కెట్ యార్డుకు 89 మంది రైతు లు 725 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చారని కార్యదర్శి శివరాజు తెలిపారు.
ప్రతి చిన్నారికి వ్యాక్సిన్


