పాక్షిక శనిత్రయోదశి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


