చైర్మన్‌గిరి..! | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌గిరి..!

Feb 15 2026 12:31 PM | Updated on Feb 15 2026 12:31 PM

చైర్మ

చైర్మన్‌గిరి..!

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినా..

కందనూలు : ఖరారు కాని పేర్లు

కొల్లాపూర్‌ : అదృష్టం ఎవరిదో..

నీ మీద నాకు మనసాయెనే

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ సంఖ్యను కాంగ్రెస్‌ సాధించింది. ఎక్స్‌ అఫీషియో ఓట్ల అవసరం లేకుండానే మూడుచోట్ల చైర్మన్‌ పీఠాలను కై వసం చేసుకోనుంది. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తమ ఓటును నమోదు చేసుకుంటున్నారు. ఇందుకు ఆదివారం మధ్యాహ్నం వరకు సమయం ఉండగా.. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యేలు సైతం ఆదివారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జిల్లా లోని మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు వచ్చినా ముందు జాగ్రత్త చర్యగా పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. వారంతా సోమ వారం ఉదయం నేరుగా మున్సిపాలిటీల చైర్మ న్‌ ఎన్నిక సమావేశానికే హాజరుకానున్నారు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ పీఠాలను కై వసం చేసుకుంది. అయితే చైర్మన్‌ పదవి కోసం ఆ పార్టీలో గెలిచిన కౌన్సిలర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సోమవారం మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం సమావేశాలు నిర్వహించనుండగా.. ఎవరికి చైర్మన్‌ పదవి వరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే చైర్మన్‌గా రత్నమాల పేరు ప్రకటించగా.. నాగర్‌కర్నూల్‌తోపాటు కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పేరును ఖరారు చేయలేదు. ఎన్నికల్లో మూడుచోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ నేతలు క్యాంపులకు తరలించారు.

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌గా ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలకు ముందు నుంచే ప్రధానంగా చైర్మన్‌ కోసం తీగల సునేంద్రతోపాటు పొడుగు శ్రీను ఆశిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ నుంచి చైర్మన్‌ ఆశించిన పొడుగు శ్రీను అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో సునేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు వైస్‌చైర్మన్‌ రేసులో బాదం రమేశ్‌ ఉన్నారు.

కల్వకుర్తి మున్సిపాలిటీలో చైర్మన్‌గా మాజీ సర్పంచ్‌ ఆనంద్‌కుమార్‌ సతీమణి రత్నమాల పేరును ఖరారు చేశారు. ఇక్కడ వైస్‌చైర్మన్‌ పదవిని షానవాజ్‌ ఆశిస్తున్నారు. అయితే వైస్‌ చైర్మన్‌ కోసం కాంగ్రెస్‌లోని మరో వర్గం సైతం పట్టుబడుతుండటంతో చివరికి ఎవరి నిర్ణయం నెరవేరుతుందోనన్న ఆసక్తి నెలకొంది.

పుర ప్రథమ పదవి కోసం హస్తం

పార్టీలో పోటాపోటీ

కొల్లాపూర్‌లో గెలిచిన వారంతా ఆశావహులే

నాగర్‌కర్నూల్‌లోనూ పేరును

ప్రకటించని నేతలు

కల్వకుర్తి చైర్‌పర్సన్‌గా రత్నమాల ఖరారు

వైస్‌చైర్మన్‌ కోసమూ కౌన్సిలర్ల మధ్య తీవ్రమైన పోటీ

చైర్మన్‌గిరి..! 1
1/1

చైర్మన్‌గిరి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement