నిరసనలు ఉధృతం..
జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి మద్దతుగా ఏర్పాటు చేసిన శిబిరంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, ప్రజాసంఘాల నాయకులు నిరసన శిబిరానికి చేరుకుని బాధితులకు మద్దతు తెలుపుతున్నారు. కుమ్మెర ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసింది.


