దుప్పిని చంపేసింది.. | - | Sakshi
Sakshi News home page

దుప్పిని చంపేసింది..

Feb 7 2026 2:47 PM | Updated on Feb 7 2026 2:47 PM

       దుప్పిని చంపేసింది..

దుప్పిని చంపేసింది..

ప్పులు చేసి సాగు చేసిన పంట అడవి పందుల దాడిలో ధ్వంసమైంది. నిత్యం పంట పొలానికి రాత్రి సమయంలో కాపలా వెళ్లేవాళ్లం. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది. వారం రోజుల క్రితం మా పొలం పక్కనే పెద్దపులి ఒక దుప్పిని చంపేసింది. అటవీశాఖ అధికారులు పంట నష్టపరిహారం అందించడంతోపాటు పెద్దపులిని దట్టమైన అడవిలోకి పంపించేలా చర్యలు తీసుకోవాలి.

– నల్లపోతుల అర్జునయ్య, రైతు, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్‌ మండలం

పులి కదలికలు వాస్తవమే..

కొంతకాలంగా ఆశించిన స్థాయిలో పెద్ద పులుల సంఖ్య పెరిగింది. దీంతో ఒక్కో పులి ఒక ఏరియా అడవిలో సంచరించడం మామూలే. ప్రతాపరుద్రుని కోట పరిసర ప్రాంత అడవిలో పెద్ద పులి కదలికలు ఉన్నాయనే మాట వాస్తవమే. గతంలో వాటి సంరక్షణ కోసం సాసర్లలో నీరు కూడా పోశాం. రైతులు, ప్రయాణికులు రాత్రి సమయంలో అటవీ సరిహద్దు ప్రాంతంలో రాకపోకలు చేయడం క్షేమం కాదు. మా బాధ్యతగా ప్రజలు, రైతుల రక్షణ కోసం సహాయక చర్యలు చేపడుతాం.

– వీరేష్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, మన్ననూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement