మేలురకం గ్రాసంతో పాల ఉత్పత్తుల పెంపు
ఉప్పునుంతల: పశువులు, గేదెలకు కృత్రిమ గర్భధారణతో ఆడ దూడలు పొందడం ద్వారా పాడి పశువుల సంఖ్య పెంపొందుతుందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రిపల్లిలో జిల్లా పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి శాఖ మహబూబ్‌నగర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరాన్ని స్థానిక సర్పంచు భూపాల్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ పాడి రైతులు పశువులకు రోగాలకు రాకుండా ముందస్తుగానే టీకాలు వేయించాలని, పాల ఉత్పత్తులు పెంచడానికి మేలురకం పశుగ్రాసం పెంచాలని, దాణా, మినరల్ మిక్చర్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, వైద్యులు బుచ్చమ్మ, అనిల్, ఉప సర్పంచు కొండల్, పశువైద్య సిబ్బంది శ్రీను, హబీబ్, మిరాజ్, గోపాలమిత్ర సూపర్‌వైజర్ మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


