50 ఏళ్ల క్రితమే తారుమారు.. | - | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల క్రితమే తారుమారు..

Feb 24 2026 7:46 AM | Updated on Feb 24 2026 7:46 AM

50 ఏళ్ల క్రితమే తారుమారు..

50 ఏళ్ల క్రితమే తారుమారు..

50 ఏళ్ల క్రితమే తారుమారు..

డ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయానికి 102 ఎకరాల భూమి ఉంది. ఇందులో జడ్చర్ల శివారులోని సర్వే నంబర్లు 125, 157, 160, 215, 267, 268లలో 63 ఎకరాల భూమి ఉంది. అలాగే భూత్పూర్‌ మండలంలోని తాటిపర్తి గ్రామ శివారులో 39 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ కూడా దేవాదాయ భూమి ఆక్రమణకు గురైంది. వీటికి భూరికార్డులు 50 ఏళ్ల క్రితమే తారుమారయ్యాయి. ఈ భూములకు సంబంధించి దేవాలయ నిర్వహణ చూస్తున్న కొందరు అర్చకులు తమ పేరు మీద రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి అవి తమకు వంశపారపర్యంగా వచ్చిన భూములుగా పేర్కొంటూ దశల వారీగా విక్రయించారు. దీంతో ఆ భూములు పలువురి చేతులు మారాయి. రియల్‌ వ్యాపారులు ఆ భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్లు విక్రయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వందలాది మంది ఇళ్లు సైతం నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం జడ్చర్ల సరస్వతీకాలనీ, మధురానగర్‌, ఆ చుట్టుముట్టు కొన్ని కాలనీలు దేవాదాయశాఖకు సంబంధించిన భూముల్లోనే వెలిశాయి.

జడ్చర్ల శివారులో

దేవాదాయ శాఖ

ఏర్పాటు చేసిన

హెచ్చరిక బోర్టు

ఐదు దశాబ్దాల క్రితమే

రికార్డులు తారుమారు

చేతులు మారిన భూముల్లో

వెలసిన వెంచర్లు, కాలనీలు

ఆలస్యంగా మేల్కొన్న

దేవాదాయ శాఖ అధికారులు

క్రయవిక్రయాలు నిలిపివేత..

ఆందోళనలో కొనుగోలుదారులు

జడ్చర్ల వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల వ్యవహారం చేంతాడులా సాగుతోంది. దశాబ్దాల తరబడి ఉలుకుపలుకు లేని దేవాదాయశాఖ అధికారులు మూడేళ్ల క్రితం మేల్కొని హడావుడి చేసి.. ఆ తర్వాత మిన్నకుండిపోయారు. దీంతో ఆ భూముల వ్యవహారం ఓ కొలిక్కిరాకుండా పోవడంతో పాటు ఆ భూముల్లో ఇళ్ల కట్టుకున్న వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఆలయ భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో క్రయవిక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతులను నిలిపివేయడంతో వందలాది మంది కొనుగోలుదారులలో ఆందోళన నెలకొంది.

– జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement