పారదర్శకంగా పుర పరిపాలన
కొల్లాపూర్: మున్సిపాలిటీ ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీంపాషాతోపాటు కౌన్సిలర్లకు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఎన్నిక అనంతరం వారిని శాలువాలు కప్పి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 19 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు, చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు కౌన్సిలర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయొద్దని, ప్రజా తీర్పును శిరసావహిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించాలని సూచించారు. అవినీతికి అవకాశం లేని పాలన అందించాలని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.


