తప్పని యూరియా తిప్పలు
జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సీజన్ ప్రారంభమై సగం గడిచిపోయినా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పెద్దకొత్తపల్లిలోని సింగిల్ విండోకు యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే యాప్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ధర్నాకు దిగారు. తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, బుకింగ్ గురించి తమకు తెలియదని వాపోయారు. పాసుపుస్తకాల ప్రకారం యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


