ప్రజలు నిర్భయంగా ఓటేయాలి : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ తెలిపారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ వద్ద పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల పరిధిలో 65 వార్డులకు గాను 131 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఇందులో 62 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు గుర్తించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్‌కు సంబంధించి 828 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 3 ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, 3 ఎస్‌ఎస్‌టీ బృందాలు చురుకుగా పనిచేస్తాయన్నారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూటర్ సెంటర్, కౌంటింగ్ హాల్‌ను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
వైద్య సిబ్బంది
నిబద్ధతతో పనిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అమలుపరుస్తున్న మాతాశిశు సంరక్షణ, టీకాకరణ, అసంక్రమిత వ్యాధులు, క్షయ, కుష్టు తదితర కార్యక్రమాలపై వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రజలకు సేవలు అందేలా చూడాలన్నారు. ఏఎన్‌ఎంలు, పర్యవేక్షణ సిబ్బంది, వైద్యాధికారులు ప్రతిఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లాలో భ్రూణ హత్యలు నివారించేందుకు స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు భరత్‌కుమార్‌రెడ్డి, తారాసింగ్, భీమానాయక్, ప్రోగ్రాం అధికారులు లక్ష్మణ్, సురేష్‌కుమార్, ప్రదీప్, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు నిర్భయంగా ఓటేయాలి : ఎస్పీ


