నాగర్‌కర్నూల్‌ | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌

Feb 11 2026 8:40 AM | Updated on Feb 11 2026 8:40 AM

నాగర్

నాగర్‌కర్నూల్‌

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణ

మైక్రో అబ్జర్వర్ల ద్వారా నిశిత పరిశీలన

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

16న చైర్మన్‌ ఎన్నిక..

జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఈ నెల 16న చైర్మన్‌ ఎన్నికలను నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ పేర్కొన్నారు. పరోక్ష ఎన్నిక విధానంలో వార్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఓ అధికారులు ఈ ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నట్టు చెప్పారు.

మూడు రౌండ్లలో కౌంటింగ్‌..

న్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూం వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్‌ చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వివరించారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ఉయ్యాలవాడలోని నైస్‌ పాఠశాలలో, కల్వకుర్తిలో మహబూబ్‌నగర్‌ రోడ్డులోని భ్రమరాంబ మల్లికార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ, కొల్లాపూర్‌ మున్సిపాలిటీ కౌంటింగ్‌ను పీజీ కళాశాల సెంటర్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లోనూ మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారు. అదేరోజున ఫలితాల వెల్లడితోపాటు గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుండగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేశామన్నారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామన్నారు.

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.

–IIలో u

నాగర్‌కర్నూల్‌1
1/1

నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement