‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో..
గత పుర పాలక ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్‌కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్‌బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్‌రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్‌బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్‌బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు.


