నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు

Feb 21 2026 7:54 AM | Updated on Feb 21 2026 7:54 AM

నల్లమ

నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు

నల్లమల అభయారణ్యంలో అరుదైన నక్షత్ర తాబేలు కనిపించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట (బ్రహ్మగిరి) నుంచి ఐటీడీఏ వైద్యాధికారి కల్యాణ్‌సాగర్‌ వాహనంపై మన్ననూర్‌ వస్తుండగా వటువర్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు రోడ్డు దాటుతూ కనిపించింది. దీంతో ఆయన దానిని పట్టుకొని మన్ననూర్‌లో అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నక్షత్ర తాబేలు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటని ఈ ప్రాంతంలో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ సుగేర్‌, ఎఫ్‌ఎస్‌ఓ నరేంద్ర తెలిపారు. ఇటీవల మంటలు వ్యాపించిన నేపథ్యంలో తాబేలు బయటికి వచ్చి ఉంటుందని వారు పేర్కొన్నారు. – అమ్రాబాద్‌

నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు 1
1/1

నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement