గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Feb 22 2026 8:34 AM | Updated on Feb 22 2026 8:34 AM

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్‌లో అధికారికంగా నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకల్లో మంత్రితోపాటు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోరే ప్రతిఒక్కరికి సేవాలాల్‌ మార్గదర్శకుడు అన్నారు. గిరిజనులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. తండాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో సేవాలాల్‌ మందిరం నిర్మిస్తామని ప్రకటించారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్‌, తహసీల్దార్‌ భరత్‌కుమార్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, సైకాలజిస్టు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా..

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని అంకిరావుపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్‌ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం తదితర గ్రామ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సురేష్‌, నాయకులు రామకృష్ట, విజయ్‌, ఉపసర్పంచ్‌ కుర్మయ్య, ఆనంద్‌, మధు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement