‘పది’ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
కందనూలు: రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంలో సీఎస్, డిపార్టుమెంట్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రశ్నపత్రాల భద్రత, సమయపాలన, సిబ్బంది బాధ్యతలు, పర్యవేక్షణ విధానాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని హెచ్చరించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు, నోడల్ అధికారి కుర్మయ్య, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అప్రమత్తంగా
ఉండాలి
అమ్రాబాద్: అటవీ శాఖ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం అమ్రాబాద్ అభయారణ్యం ఫరహాబాద్ బేస్ క్యాంపులను తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. వేసవి నేపథ్యంలో అడవుల్లో మంటలు వ్యాపించి.. వన్యప్రాణులు, అడవులకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంట ఎఫ్‌డీ సునీల్ హెరామత్, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర తదితరులున్నారు.
త్వరలోనే బీచుపల్లి ఆయిల్ మిల్లు ప్రారంభం
ఎర్రవల్లి: జిల్లాలో ఆయిల్‌పాం తోటలు సాగు చేసిన రైతులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని త్వరలోనే బీచుపల్లి ఆయిల్ మిల్లు ప్రారంభమవుతుందని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీచుపల్లి ఆయిల్ మిల్లులో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్, సివిల్, నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయిల్ మిల్లులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీచుపల్లిలో నూతన ఆయిల్ మిల్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయన్నారు. బీచుపల్లిలో ఆయిల్‌మిల్లు 95.20 ఎకరాల్లో ఉందని అందులో రూ.47 కోట్ల వ్యయంతో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈటీపీ వంటి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీకి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్, సివిల్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల మిల్లులో ఉన్న 11 భవనాలకు ఎన్‌డీటీ బృందం నాణ్యతా ప్రమాణ పరీక్షలను నిర్వహించి కేవలం రిఫైనరీ ఒకటి మాత్రమే నాణ్యత లేదని నిర్ధారించిందన్నారు. అలాగే రైతు సేవా కేంద్రం నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. రైతులకు ఆయిల్‌పాం పంటలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయిల్‌పాం పంటలకు అవసరమైన డ్రిప్, ఎరువులు, హార్వెస్టింగ్, పరికరాలు కూడా త్వరలోనే ఆయిల్ మిల్లులో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
‘పది’ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
‘పది’ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి


