పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి | - | Sakshi
Sakshi News home page

పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి

Feb 27 2026 8:11 AM | Updated on Feb 27 2026 8:11 AM

పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి

పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయండి

కందనూలు: మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేసి.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి సూచించారు. గురువారం నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కొత్త పాలకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలతో పాటు శుభ్రత, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పుర చైర్మన్‌గా తీగల సునేంద్ర కుమార్‌, వైస్‌చైర్మన్‌గా బాదం రమేశ్‌, కౌన్సిల్‌ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement