రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌! | - | Sakshi
Sakshi News home page

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌!

Feb 28 2026 8:37 AM | Updated on Feb 28 2026 8:37 AM

రేర్‌

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌!

జన్యుపరమైన లోపాలతోనూ చర్మవ్యాధులు

ఈ ఫొటోలో మందంగా మారిన అరచేతులు, కాళ్లను చూపిస్తున్న వ్యక్తిది హనుమాన్‌పల్లి గ్రామ పరిధిలోని ఓ తండా. జన్యు లోపంతో చర్మవ్యాధి బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఇలాగే ఉంది. రోజురోజుకూ పెద్దగా అవుతోంది. మహబూబ్‌నగర్‌లో, హైదరాబాద్‌లో చాలా ఆస్పత్రులకు తిరిగా. మహారాష్ట్రలో ఉండగా.. అక్కడి డాక్టర్ల వద్దకూ వెళ్లా. రూ.3 లక్షలు కడితే అమెరికాలో ట్రీట్‌మెంట్‌ చేసుకోవచ్చని అక్కడి డాక్టర్‌ చెప్పారు. సిద్ధమైన తర్వాత గ్యారంటీ ఇవ్వలేమనడంతో ఆశలు వదులుకున్నా. నాతోపాటు గ్రామంలో ఐదారుగురి పరిస్థితి ఇలాగే ఉంది.’ అని ఆయన

తన ఆవేదన వెళ్లగక్కారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో చర్మ సంబంధిత వ్యాధుల శాతం పెరుగుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌తోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో డెర్మటాలజీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. పరిశుభ్రత, పోషకాహారంతోపాటు జీవనశైలిలో లోపాలు, వాయు, జల కాలుష్యంతో చర్మ వ్యాధుల బారినపడే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌తోపాటు పలు పరిశోధన సంస్థల అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. జన్యుపరమైన లోపాలతో సైతం స్కిన్‌ డిసీజ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి బాధితులు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఇప్పటి వరకు అతి తక్కువే. తాజాగా ఉమ్మడి పాలమూరులో ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడిన కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ధన్వాడ మండలంలో..

గతంలో కరీంనగర్‌, రంగారెడ్డి, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జన్యు లోపాలతో చర్మ వ్యాధుల బారిన పడిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలోని నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్‌పల్లితోపాటు దాని చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి బాధితులు ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. వీరిలో పలువురు ఏనుగొండలోని ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలో కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు.

అరి చేతులు, కాళ్లలో స్పర్శ కోల్పోయి..

హనుమాన్‌పల్లి గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1 ,425 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 7 28, మహిళలు 697 మంది. వీరిలో ఎస్టీ సామాజిక వ ర్గానికి చెందినవారు 250 మంది వరకు ఉన్నట్లు అంచనా. ఈ వర్గానికి చెందిన సుమారు 25 నుంచి 30 మంది వరకు జన్యు లోపాలతో వచ్చిన చర్మ వ్యా ధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందులో అధి క సంఖ్యలో ప్రధానంగా పామోప్లాంటార్‌ కెరటోడ ర్మా వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అరి చేతులు, పాదాలు మందమై.. స్పర్శ కోల్పోవడం, చర్మం పగుళ్లు రావడం, నడిచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు నొప్పి ఉండడం, దురద వంటివి ఈ వ్యాధి లక్షణాలు.

అవగాహన లేకపోవడంతో అనేక ఏళ్లుగా ఇబ్బందులు

తాజాగా ఉమ్మడి పాలమూరులో వెలుగులోకి..

రక్త సంబంధీకుల మధ్య వివాహాలేకారణమంటున్న వైద్యులు

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌! 1
1/3

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌!

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌! 2
2/3

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌!

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌! 3
3/3

రేర్‌ డిసీజెస్‌.. బీ అలర్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement