ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష
కందనూలు: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ నిమిత్తం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. మొత్తం 7,546 మంది విద్యార్థులకు గాను, 7,263 మంది హాజరయ్యారు. 283 మంది గైర్హాజరయ్యారని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జోనల్ అధికారి విద్యుల్లత తెలిపారు.
పుర ఫలితాలే ప్రజాపాలనకు నిదర్శనం
చిన్నంబావి: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు పురపాలికల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని వెల్టూరులో కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ కళ్యాణరావుతో కలిసి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ, మండల కేంద్రంలో దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందజేసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారన్నారన్నారు. రెండేళ్ల ప్రజాపాలనలో పేదలకు అనేక సంక్షేమ పఽథకాలు అందించడమేగాక ప్రశాంత వాతావరణం కల్పించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పాలనపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని పథకాలు అమలు చేస్తామని వివరించారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ..
వెల్టూరులో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బాలకిష్టయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన బాలీశ్వరి ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. బాలిశ్వరి పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, కృష్ణప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష


