ముహూర్తం నేడే..
న్యూస్‌రీల్
నాగర్‌కర్నూల్
పురాల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు
● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్,
18 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు
● వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్‌కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం
● మహబూబ్‌నగర్, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే..
● గద్వాలలో సైతం హస్తానికే అవకాశం
● నారాయణపేటలో బీజేపీకే
మొగ్గుచూపుతున్న పరిస్థితులు
● అయిజతోపాటు అలంపూర్‌లో
బీఆర్‌ఎస్‌కు లైన్‌క్లియర్
● అమరచింతలో బీఆర్‌ఎస్,
బీజేపీ కూటమికే..
వాతావరణం
ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం వేడిగా, సాయంత్రం ఆహ్లాదంగా ఉంటుంది. రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది.
సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్‌నగర్ బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్మన్/డిప్యూటీ చైర్‌పర్సన్లను ఎన్నుకోనున్నారు.
భూత్పూర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కోస్గి, మద్దూర్‌తో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్‌బీ మ్యాజిక్ ఫిగర్‌ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది.
ముహూర్తం నేడే..


