క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభ

Feb 24 2026 7:46 AM | Updated on Feb 24 2026 7:46 AM

క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభ

క్రమశిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభ

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు సిబ్బంది క్రమ శిక్షణతో సాధన చేస్తే క్రీడల్లో ప్రతిభచాటి పతకాలు సాధించవచ్చని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ క్రీడలలో జిల్లా పోలీస్‌ అధికారులు జోగుళాంబ జోన్‌ తరపున క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించినట్లు సోమవారం ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడలు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరంలో జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నారని, జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆర్‌ఐ జగన్‌, ఆర్‌ఎస్‌ఐ శివాజీ, గౌస్‌ లాన్‌ టెన్నిస్‌ నాన్‌ గెజిటెడ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ టీం ఈవెంట్‌ విభాగంలో పాల్గొని మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన సాధన దృఢ సంకల్పంతో విజయం సాధించారని, మున్ముందు మరిన్ని క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement