బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ | - | Sakshi
Sakshi News home page

బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ

Feb 13 2026 4:06 AM | Updated on Feb 13 2026 4:06 AM

బాలిక

బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ

కందనూలు: పోటీ ప్రపంచంలో బాలికలు కేవలం పుస్తక జ్ఞానంతో మాత్రమే కాకుండా సృజనాత్మకత, సమయస్ఫూర్తి, వివేకంతో కూడిన ఆలోచనలను అలవర్చుకుని ముందుకు సాగాలని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌ మండలంలోని నాగనూల్‌ కేజీబీవీలో పదో తరగతి విద్యార్థినులకు నిర్వహించిన ఫేర్‌వెల్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు వంటివని చెప్పారు. పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. ప్రతి బాలిక తనలోని ప్రతిభను గుర్తించి, సృజనాత్మకతను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. మహిళా విద్య సమాజాభివృద్ధికి చాలా కీలకమని పేర్కొన్నారు. చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న కేంద్రం

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: దేశంలో ఉన్న పదిమంది పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టాలు మార్చి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను పట్టణంలోని కార్మిక సంఘాలు విజయవంతంగా కొనసాగించారు. ఈ సందర్భంగా గాంధీ పార్కు వద్ద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసులు, శివశంకర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, వీబీజీ రాంజీ జాతీయ విత్తన బిల్లు, విద్యుత్‌ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కనీసం వేతనం అమలు, ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ పీఎఫ్‌ తదితర సౌకర్యాలు వెంటనే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతాలు, జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య, నాయకులు రవీందర్‌, శంకర్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, రామకృష్ణ, జయమ్మ, వరలక్ష్మి, కవిత, జస్వంత్‌, అలివేలమ్మ, బాలీశ్వర్‌, కుర్మయ్య, చింతలయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ
1
1/1

బాలికలు సృజనాత్మకతతో ఆలోచించాలి : డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement