యాప్‌లోనే యూరియా
అచ్చంపేట: ఫెర్టిలైజన్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. సాగుతూ.. ఆగిన యూరియా బుకింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నెల 31 నుంచి పక్కాగా అమలవుతుండటంతో బక్ చేసుకోకుండా ఎరువుల దుకాణానికి వెళ్లితే ఎరువులు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికారు. ఎరువుల డీలర్లు, సహకార సంఘాల సీఈఓలు తమ స్టాక్ రిజిస్టర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ ఐడీలను తీసుకుని రైతు వేదికల వద్దకు రావాలని రెండు రోజుల క్రితం వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిల్వలకు సంబంధించి సమాచారం పూర్తిస్థాయిలో తెప్పించుకుని గురువారం ఉదయం నుంచే యాప్ ద్వారా విక్రయాలు ప్రారంభించారు. దీంతో యాప్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఒకసారి బుక్ చేసిన తర్వాత రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి కొనుగోలు చేశాకా రెండో విడత 15 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి.
సాంకేతిక సమస్యలతో..
రెండు నెలల క్రితం యాసంగి సీజన్ మొదట్లోనే యూరియా పంపిణీకి ప్రభుత్వం యాప్ తీసుకొచ్చినా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సక్రమంగా పనిచేయలేదు. అధికారులు గ్రామాలకు వచ్చి రైతులకు కూపన్లు రాసిచ్చి సహకార సంఘాల ద్వారా సరఫరా చేశారు. క్యూలైన్ల బాధతప్పి సులభంగా యూరియా లభించింది.
విడతల వారీగా సరఫరా..
రైతులు ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులు మూడు విడతల్లో, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం భూమి ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రత్యేక యాప్‌తోనే బుకింగ్‌కు అవకాశం
యాసంగిలోనే అమలులోకి
వచ్చిన విధానం
రైతులు ముందుగా బుక్ చేసుకోవాలి


