విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : డీఈఓ
అమ్రాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ముందుకెళ్లాలని సూచించారు. సోమవారం ఆయన పదర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతోపాటు మండలంలోని వంకేశ్వరం, ఉన్నత, ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బుచ్చిబాబుతో కలిసి త నిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యా సంబంధమైన కా ర్యక్రమాలు, చదువులో విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరీక్షించారు. వంకేశ్వరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు హరీష్‌కుమార్‌కు షోకా జ్ నోటీసులు అందాయి. డీఈఓ తనిఖీ సమయంలో ఉపాధ్యాయుడు విధుల్లో లేకపోవడంతో డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ బుచ్చిబాబు షోకాజ్ నోటీసులు అందజేశారు. అనంతరం డీఈఓ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.


