అన్ని అనుమతులు ఉన్నాయి
ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో న్యాయపరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిచూసుకొనే కొనుగోలు చేశాం. 20 ఏళ్ల క్రితమే పట్టాదారుల రిజిస్ట్రేషన్‌తో పాటు నాలా, డీటీసీపీ అనుమతులు ఉన్నాయి. గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకున్నాం. పన్నులు కూడా కడుతున్నాం. ఇలాంటి సమయంలో ఇప్పడు దేవాదాయశాఖ భూమి అంటూ ఇబ్బంది పెట్టడం సరికాదు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. కాలనీల్లో ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న దేవాదాయ భూములను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. – రాఘవేందర్,
అధ్యక్షుడు, సరస్వతీ కాలనీ, జడ్చర్ల
దేవాదాయ శాఖ పేర్కొన్న సర్వే నంబర్లలో ఇళ్లు, తదితర నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. గతంలోనే అనుమతులు నిలిపివేయాలని దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం వల్లే.. అన్ని అనుమతులు ఆపేశాం.
– లక్ష్మారెడ్డి, కమిషనర్, జడ్చర్ల మున్సిపాలిటీ


