అంగన్‌వాడీలపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై ఫోకస్‌

Feb 20 2026 7:21 AM | Updated on Feb 20 2026 7:21 AM

అంగన్‌వాడీలపై ఫోకస్‌

అంగన్‌వాడీలపై ఫోకస్‌

సర్పంచ్‌లకు కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత

పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు చర్యలు

గర్భిణులు, చిన్నారులకు మేలు జరిగే అవకాశం

గాడిన పడేనా..

సర్పంచ్‌ల పర్యవేక్షణతో అంగన్‌వాడీ కేంద్రాలు గాడిన పడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయా కేంద్రాలను ఐసీడీఎస్‌ పీడీ, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పర్యవేక్షించాల్సి ఉంది. వీరిలో చాలా మంది కార్యాలయానికే పరిమితం కావడం.. చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడమే తప్పా ఎలాంటి ప్రయోజం లేకుండా పోతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆయా కేంద్రాల్లో చిన్నారులు లేకపోయినా సరుకులను లబ్ధిదారులకు ఇచ్చినట్లుగా కొంత మంది నమోదు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ల పర్యవేక్షణతో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కానుంది. ఇక్కడ చదివిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

11 మందితో కమిటీ..

అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు సంబంధించి 11 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి సర్పంచ్‌ చైర్‌పర్సన్‌గా, అంగన్‌వాడీ టీచర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏఎన్‌ఎం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, రిటైర్డ్‌ ఉద్యోగి, చిన్నారుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో మున్సిపల్‌ పరిధిలోని కేంద్రాలను మినహాయించి.. గ్రామ పంచాయతీల్లోని కేంద్రాలకు సర్పంచ్‌లు చైర్మన్‌గా ఉంటారు.

అచ్చంపేట: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం గ్రామ పంచాయతీల పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో కొత్త కమిటీల ద్వారా పర్యవేక్షణ పెంచాలని నిర్ణయించింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందనుంది. అలాగే సిబ్బంది సమయపాలన మెరుగుపడటంతో పాటు అక్రమాలకు చెక్‌ పడనుంది.

పనిచేస్తున్న ఆయాలు 667

ఆయాల ఖాళీలు

467

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement