విద్యార్థులు శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంచుకోవాలి

Feb 24 2026 7:46 AM | Updated on Feb 24 2026 7:46 AM

విద్యార్థులు శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంచుకోవాలి

విద్యార్థులు శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంచుకోవాలి

కందనూలు: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాసీ్త్రయ జ్ఞానాన్ని పెంపొందించుకొని తమ చుట్టూ జరుగుతున్న విషయాలను పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉందని డీఈఓ రమేష్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన భౌతిక, రసాయన శాస్త్ర జిల్లా స్థాయి టాలెంట్‌ టెస్ట్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. స్మార్ట్‌ఫోన్లను వినోదానికి మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే సాధనంగా ఉపయోగించుకోవాలని హితవు పలికారు. జిల్లాస్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న ముగ్గురు విద్యార్థులకు డీఈఓ నగదు బహుమతులు అందజేసి.. జ్ఞాపికలతో సత్కరించారు. ఈ క్రమంలో సిర్సవాడ జెడ్పీహెచ్‌ఎస్‌ 9వ తరగతి విద్యార్థిని జడ్పిహెచ్‌ఎస్‌ దీక్షిత మొదటి స్థానం సాధించగా, అదే పాఠశాల చెందిన విద్యార్థి హర్షవర్ధన్‌ రెండో స్థానం, బల్మూరు జెడ్పీహెచ్‌ఎస్‌ 9వ తరగతి విద్యార్థి కిరణ్‌సాగర్‌ మూడోస్థానం సాధించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎంలు భాస్కర్‌రెడ్డి, ఎఫ్‌పీఎస్‌టీడీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement