పాడితో రైతులకు అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పాడితో రైతులకు అదనపు ఆదాయం

Feb 18 2026 8:23 AM | Updated on Feb 18 2026 8:23 AM

పాడితో రైతులకు అదనపు ఆదాయం

పాడితో రైతులకు అదనపు ఆదాయం

ఉప్పునుంతల: రైతులు వ్యవసాయంతోపాటు పాడి ఆవులు, గేదెలను పెంచుకుంటే అదనపు ఆదాయం పొందడంతోపాటు వాటి నుంచి వచ్చే ఎరువులను వేసుకుంటే పొలాలు సారవంతమవుతాయని జిల్లా పశువైద్య శాఖాధికారి జ్ఞానేశ్వర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాపూర్‌లో పశుసంవర్ధశాఖ, పశుగణాభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పాడి పశువుల గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాడి పశువులకు సకాలంలో గర్భకోశ వ్యాధి పరీక్షలు చేయించి చికిత్స అందిస్తే సకాలంలో ఎదకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పాడి రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచు బరిగెల శ్రీకాంత్‌, ఉప సర్పంచు రేణయ్య, పశువైద్యాధికారులు వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌కుమార్‌, బుచ్చమ్మ, సిబ్బంది శ్రీను, హబీబ్‌, మిరాజ్‌, సూపర్‌వైజర్‌ మురళీధర్‌రెడ్డి, గోపాలమిత్రలు, పాడిరైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement