కంటిచూపుపై నిర్లక్ష్యం వహించొద్దు
కల్వకుర్తి రూరల్: డ్రైవర్లు కంటిచూపు సమస్యలపై నిర్లక్ష్యం వహించొద్దని కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఆమనగల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కంటి వైద్యసిబ్బంది వెంకటేశ్, వెంకటస్వామి డ్రైవర్లకు పరీక్షలు చేసి.. అవసరమైన మందులు అందజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి డ్రైవర్‌కు తప్పనిసరిగా దూరం, దగ్గరిచూపు ఉండాలన్నారు. డ్రైవర్లకు కంటి సమస్యలు ఉంటే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా మద్యం తాగి వాహనాలు నడపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు మాధవరెడ్డి, కృష్ణమూర్తి, కృష్ణదేవ పాల్గొన్నారు.


