ఆర్భాటాలతో అప్పుల పాలు కావద్దు : మంత్రి
వీపనగండ్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిబంధనలను విస్మరించి ఆర్భాటాలకు వెళ్లి అప్పులపాలు కావద్దని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్ధిదారులకు సూచించారు. బుధవారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాలలో ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని చెప్పారు. కల్వరాలలో నెలకొన్న నీటిఎద్దడిని సత్వరమే పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్‌లు పల్ల జయంతి, బండారి రాముడు, బలుస రామన్‌గౌడ్ పార్టీ నాయ కులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


