ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలుద్దాం | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలుద్దాం

Mar 1 2026 8:23 AM | Updated on Mar 1 2026 8:23 AM

ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలుద్దాం

ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలుద్దాం

కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి.. జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని అదనపు కలెక్టర్‌ అమరేందర్‌ అన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల పదో తరగతి విద్యార్థులకు శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ మార్గనిర్దేశం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలంటే భయం వీడాలన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయ బృందం అందుబాటులో ఉంటుందని.. ఏ సమయంలోనైనా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ యన సూచించారు. కార్యక్రమంలో డీఈఓ రమేశ్‌కుమార్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ అధి కారి ఉమాపతి, సైకాలజిస్ట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement