అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కందనూలు: గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ మైదానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చారకొండ విశ్వశాంతి ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన జానపద నృత్యానికి ప్రథమ బహుమతి, పెంట్లవెల్లి కేజీబీవీ విద్యార్థుల దేశభక్తి నృత్యానికి ద్వితీయ, బల్మూరు కేజీబీవీ విద్యార్థుల కోయ నృత్యానికి తృతీయ, పాలెం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థుల నృత్యానికి తృతీయ బహుమతి లభించాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన శకటాలు, స్టాళ్లను పరిశీలించారు.


