ప్రజావాణికి 40 వినతులు
నాగర్‌కర్నూల్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి 40 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 7..
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 2 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.
ఉచిత శిక్షణనువినియోగించుకోండి
నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు పోటీ పరీక్షల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివద్ధి శాఖ అధికారి ఉమాపతి ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన వాల్‌పోస్టర్లను అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్‌తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల అభ్యర్థులు ఈ నెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 8న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేసి, వారికి ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇస్తారన్నారు. ఉచిత శిక్షణ తరగతులను జిల్లాలోని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయి సర్వీసెస్ గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు.
వేరుశనగ @ రూ.9,001
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 178 మంది రైతులు 4,729 బస్తాలలో 1,425 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తెచ్చారని కార్యదర్శి శివరాజు తెలిపారు. వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.9,001, కనిష్టంగా రూ.7,030, సరాసరిగా రూ.8,729 ధరకు వ్యాపారులు టెండర్లు వేశారు. కందులు క్వింటాల్ రూ.6,501 ధర లభించింది.
● ఉమామహేశ్వరం.. భక్తజన సంద్రం
● మానవత్వం చాటిన మంత్రి వాకిటి
● జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
– వివరాలు 8లో..


