భారతదేశంలో బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. ఉదయం ఒక రేటు, సాయంత్రానికి ఇంకో రేటు ఉంది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఎంతలా దూసుకెల్తూ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకుందాం.
ఈ రోజు (జనవరి 19) ఉదయం 1,33,550 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు.. సాయంత్రానికి రూ. 1,34,050 వద్దకు (రూ. 500 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,690 రూపాయల నుంచి రూ. 1,46,240 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.
ఢిల్లీలో కూడా ధరలు తారుమారయ్యాయి. ఉదయం 1,33,700 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి రేటు.. ఇప్పటికి రూ. 1,34,200 వద్ద (రూ. 500పెరిగింది) నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు 1,45,840 రూపాయల నుంచి రూ. 1,46,390 వద్దకు (550 రూపాయలు పెరిగింది) చేరింది.
చెన్నైలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల రేటు 1,34,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 146730 వద్ద ఉంది. వెండి రేటు ఏకంగా రూ.3 లక్షలు (1000 గ్రాములు) దాటేసింది.
ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!


