ముంబై: మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన యువతి.. ఆత్మహత్య చేసుకుంది. తన చేతిపై అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి అని రాసి తనువు చాలించింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
గంగాపూర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మధుకర్ కడ్ వివరాల మేరకు.. ధ్రువ్ నగర్‌కు చెందిన దీక్షా త్రిభువన్(21) పుట్టుకపోతే దివ్యాంగురాలు. మాటలు కూడా సరిగా రావు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. తన చేతిపై క్షమించండి... అమ్మా నాన్న, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాసిపెట్టి ఉంది. ఆమె మృతిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
మరోవైపు.. తన కూతురు మృతి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. దీక్ష ఎప్పుడూ ధైర్యంగా, అందరితో ఎంతో సేహ్నంగా ఉండేది. ఆమెనే మా భవిష్యత్ అనుకున్నాం. ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అసలు ఊహించలేదు అని కన్నీరు పెట్టుకున్నారు. అయితే, తాను దివ్యాంగురాలైన కారణంగానే మసస్థాపానికి గురై దీక్ష ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.


