ప్రియురాలితో పాటు స్నేహితురాలిని హత్య చేసిన రష్యా జాతీయుడైన అలెక్సీ లియోనోవ్(37), కేసులో వెలుగులోకి వచ్చిన విషయం సంచలనం రేపుతున్నాయి. గోవాలో జనవరి 14న మోర్జిమ్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్న ఎలెనా వనీవా , ఎలెనా కస్థానోవాగాను హత్య చేశాడు. వీరిద్దరూ రష్యా జాతీయులే. అప్పుగా తీసుకున్న డబ్బు, 'ఫైర్ క్రౌన్' (ఫైర్ డ్యాన్సర్స్ తలపై నిప్పును పట్టుకోవడానికి ఉపయోగించే రబ్బరు కిరీటం) విషయంలోనే వీరిని హత్య చేసి ఉంటాడని గోవా పోలీసులు తెలిపారు.
ఎన్‌డీటీవీ కథనం ప్రకారం మృతుల్లో ఒకరైన ఎలెనా కస్థానోవా, ఒక ఫైర్ డ్యాన్సర్. ఆమె ఫైర్ క్రౌన్ అప్పుగా తీసుకుంది. అలాగే మరో మహిళ కూడా డబ్బు అప్పుగా తీసుకుందట. అయితే, ఇద్దరు బాధితులు అలెక్సీకి డబ్బును ,కిరీటాన్ని తిరిగి ఇవ్వడంలో ఆలస్యానికి ఆగ్రహానికి గురైన అతను, జనవరి 14 , 15 తేదీలలో వేర్వేరు రోజులలో గొంతు కోసి చంపేశాడు. అయితే ముందుగా ప్లాన్ చేసినవి కావని, ఆవేశపరుడైన అలెక్సీ ఆవేశంతో చేసినవని పోలీసు వర్గాల అంచనా. ఈ హత్యల సమయంలో నిందితుడు మాదకద్రవ్యాల మత్తులో ఉన్నాడా లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బబుల్ ఆర్టిస్ట్ అయిన ఎలెనా వనీవా జనవరి 10న గోవాకు రాగా, కస్థానోవా గత సంవత్సరం డిసెంబర్ 25 నుండి, నిందితుడితో కలిసి ఉంటోంది. వీరిద్దరూ దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసేవారని మరియు తరచుగా గోవాను సందర్శించేవారట.
ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్
అలెక్సీ లియోనోవ్‌కు లాంగ్ టెర్మ్ వీసా
అలెక్సీకి భారతదేశానికి దీర్ఘకాలిక వీసా ఉందని , పని నిమిత్తం దేశంలోని అనేక నగరాల్లో , ఎక్కువగా గోవాలో ఉండేవాడు. ఏవేవో చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. గత డిసెంబరులో గోవాకి వచ్చాడు. అయితే గత నెల రోజులుగా ఎలాంటి పనిలేదు. నిందితుడు దాదాపు నెల రోజులుగా పని చేయడం లేదు.
సీరియల్ కిల్లరా?100 మంది మహిళల ఫోటోలు
నిందితుడు తనతో గొడవపడిన మరో ఐదుగురిని కూడా చంపానని చెప్పి, వారి పేర్లను కూడా ప్రస్తావించాడని గోవా పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఆ ఐదుగురూ సజీవంగా ఉన్నారని పోలీసులు విచారణలో తేలింది. అలెక్సీ "మానసిక అనారోగ్యంతో" బాధపడుతున్నాడని ప్పుడూ మాదకద్రవ్యాల ప్రభావంలో ఉంటాడని కూడా పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు నిందితుడి ఫోన్‌లో100 మందికి పైగా మహిళలు, ఇద్దరు పురుషుల ఫోటోలను కూడా గోవా పోలీసులు కనుగొన్నారు. గోవాలో ఇటీవలి కాలంలో పురుషులపై దాడి జరిగిన అనేక కేసుల్లో అతని పాత్ర ఉన్నట్టు కూడా అనుమానిస్తున్నారు. కానీ అతనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అసోం మహిళ హత్య కూడా వీడి పనేనా?
అసోం నివాసి మృదుస్మిత సైంకియా అనుమానాస్పద మరణంపై కూడా అలెక్సీ పాత్రను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమెతో అలెక్సీ సన్నిహితంగా ఉండేవాడని, ఇద్దరూ చాలా సార్లు గోవాకు వెళ్లేవారని తెలుస్తోంది. సైంకియా శవమై కనిపించడానికి ఒక రోజు ముందు, (జనవరి 11న)కూడా ఇద్దరూ కలిసే ఉన్నారట. జనవరి 12న తన ఇంట్లో శవమై కనిపించిచింది సైంకియా. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అధిక మోతాదులో డగ్ర్స్ తీసుకోవడం వల్ల ఆమె మరణించిందని భావించారు.


