శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయంలో శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచి పాల్గొన పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి భక్తుల చేత గోత్రనామార్చనలు, తిలతైలాభిషేకాలు, ప్రదక్షిణలు చేయించారు. అనంతరం భక్తులు ప్రత్యేక స్నానాలు ఆచరించి బ్రహ్మసూత్ర శివుడిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మెరిట్ జాబితా
పరిశీలించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో 12 ఏఏఎంఎస్, 12 ఎంఎల్‌హెచ్‌పీఎస్ పోస్టులకు సంబంధించిన ప్రొవిజినల్ మెరిట్ జాబితాను అభ్యర్థులు పరిశీలించుకోవాలని డీఎంహెచ్‌ఓ రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్టును www.nagarkurnoo l.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామని చెప్పారు.
ఫుట్‌బాల్ క్రీడాకారిణికి కలెక్టర్ అభినందన
కందనూలు: మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు క్రీడాకారిణి వినూతశ్రీ అండర్–19 విభాగంలో ఎంపికై ందని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సీతారాం తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ బదావత్ సంతోష్ విద్యార్థినిని కార్యాలయంలో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కోచ్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
4,758 బస్తాల
వేరుశనగ రాక
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు 149 మంది రైతులు 4,758 బస్తాలలో 1,429 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి తీసుకువచ్చారని కార్యదర్శి శివరాజు తెలిపారు. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.9,010, కనిష్టంగా రూ.6,802 ధర పలకగా.. సరాసరిగా రూ.8,500 లభించిందని ఆయన చెప్పారు. మార్కెట్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు


