ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం : ఆర్‌ఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: ములుగు జిల్లాలో ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో మేడారం వెళ్లలేని భక్తులకు ఇంటివద్దకే అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా అందజేయనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. ఆర్‌ఎం కార్యాలయంలో టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ మేడా రం కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. భక్తులు రూ.299 చెల్లిస్తే దేవాదాయశాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం పాకెట్, దేవతల ఫొటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుందన్నారు. భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్ లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు లక్ష్మిధర్మ, కవిత, టీజీఎస్‌ఆర్టీసీలాజిస్టిక్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇంటివద్దకే మేడారం బంగారం ప్రసాదం : ఆర్‌ఎం


