పకడ్బందీగా వన్యప్రాణుల గణన
లింగాల/ దోమలపెంట: లింగాల రేంజ్ పరిధిలో ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొదటిరోజు నల్లమల ప్రాంతంలో పులులు, ఇతర వన్యప్రాణుల లెక్కింపును అటవీ శాఖ బృందం ప్రారంభించింది. అప్పాయపల్లి ఏరియాలో 2 కిలోమీటర్ల మేరకు కాలినడకన వెళ్లిన గణన బృందం క్రాన్సెక్ట్ లైన్‌కు ఉదయం 6 గంటలకు చేరుకొని వన్యప్రాణుల పాదముద్రలు సేకరించారు. ఈ సందర్భంగా చుక్కల దుప్పులు, మనుబోతులు, కొండముచ్చులు, నీలిగాయలు, అడవి పందులు, కొండ గొర్రెలు, నెమళ్లు, అడవి కోళ్లు తదితర వాటిని గమనించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. అనంతరం పద్మన్నపల్లి, లింగాల, ధారారం బీట్లలో డీఆర్‌ఓ జయదేవ్, బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో శాకాహార జంతువుల గణన చేపట్టారు. అలాగే దోమలపెంట పరిధిలో సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ మోయిజుద్దీన్, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున సమక్షంలో గణన ప్రారంభించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ గురుప్రసాద్ తెలిపారు.


