వైభవంగా శేషవాహన సేవ
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం రాత్రి స్వామివారికి శేషవాహన సేవ నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి శేషవాహనంపై ఊరేగించారు. భక్తుల సమక్షంలో సమీపంలో ఉన్న రత్నగిరి అమ్మవారి గుట్ట వరకు స్వామివారి శేషవాహన సేవ కొనసాగింది. అంతకు ముందు స్వామి వారికి దీక్షాహవనం, మూలమంత్ర హవనం, తీర్థావళి, బలిహరణం, పూర్ణాహుతి, వసంతోత్సవం, సాయంత్రం స్వామివారి గర్భగుడిలో డోలోత్సవం, చప్పరపు సేవ నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు సంపత్‌కుమార్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు.


