జలాశయం సామర్థ్యం తగ్గించే దాకా ఆందోళన
చారకొండ: డిండి– నార్లాపూర్ నిర్మాణంలో భాగంగా మండలంలోని గోకారం శివారులో చేపడుతున్న జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిర్వాసితులు అన్నారు. ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 60 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ముంపునకు కాకుండా చూడాలన్నారు. ఇదే డిమాండ్‌తో ఇటీవల పంచాయతీ ఎన్నికలు బహిష్కరించి.. వివిధ రకాలుగా నిరసనలు తెలిపినా.. ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేపడుతామని హెచ్చరించారు.
రిలే దీక్షల్లో కూర్చున్న నిర్వాసితులు


